CONGRESS: ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌కు తలనొప్పి..!

కాంగ్రెస్‌కు తలనొప్పిలా ఫిరాయింపులు... తీవ్ర విమర్శలు చేస్తున్న గులాబీ పార్టీ.. తమ పార్టీ వారు కాదంటున్న కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల వేళ తలనొప్పి

Update: 2026-01-23 05:30 GMT

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో అధి­కా­రం­లో ఉన్న కాం­గ్రె­స్ పా­ర్టీ­కి ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యేల అంశం ఇప్పు­డు పె­ద్ద తల­నొ­ప్పి­గా మా­రిం­ది. ఒక­ప్పు­డు వ్యూ­హా­త్మక వి­జ­యం అని భా­విం­చిన ని­ర్ణ­య­మే, ఇప్పు­డు పా­ర్టీ­ని లో­ప­లి­నుం­చి కు­ది­పే­స్తు­న్న సమ­స్య­గా మా­రిం­ది. బల­మైన ప్ర­తి­ప­క్షా­న్ని ని­ర్వీ­ర్యం చే­యా­ల­నే లక్ష్యం­తో కాం­గ్రె­స్ పా­ర్టీ నా­య­క­త్వం బీ­ఆ­ర్ఎ­స్ నుం­చి పది మంది ఎమ్మె­ల్యే­ల­ను తమ­వై­పు తి­ప్పు­కో­గా, ప్ర­స్తు­తం ఆ ని­ర్ణ­య­మే మిం­గు­డు పడని మె­తు­కు­లా మా­రిం­ద­న్న అభి­ప్రా­యం రా­జ­కీయ వర్గా­ల్లో వి­ని­పి­స్తోం­ది. ఈ ఎమ్మె­ల్యే­ల­పై అన­ర్హత వేటు పడ­కుం­డా ఉం­డేం­దు­కు వారు సాం­కే­తి­కం­గా కాం­గ్రె­స్‌­లో లే­ర­ని, ఇంకా తమ పాత పా­ర్టీ­కే చెం­దా­మ­ని చె­బు­తు­న్న పరి­స్థి­తి పా­ర్టీ­కి ఇబ్బం­ది­క­రం­గా మా­రిం­ది. ఆశ్చ­ర్య­క­ర­మైన వి­ష­యం ఏమి­టం­టే, ఆ పది మం­ది­లో చా­లా­మం­ది అదే వై­ఖ­రి­ని క్షే­త్ర­స్థా­యి­లో­నూ కొ­న­సా­గి­స్తు­న్నా­రు. ము­ఖ్యం­గా ము­న్సి­ప­ల్ ఎన్నితీ­వ్ర గం­ద­ర­గో­ళా­న్ని సృ­ష్టి­స్తోం­ది.

కాంగ్రెస్‌కు దూరంగా...

పటా­న్ చెరు, గద్వాల వంటి ని­యో­జ­క­వ­ర్గా­ల్లో పరి­స్థి­తి మరింత క్లి­ష్టం­గా తయా­రైం­ది. కాం­గ్రె­స్ కం­డు­వా కప్పు­కు­న్న­ప్ప­టి­కీ, ఈ ఎమ్మె­ల్యే­లు పా­ర్టీ కా­ర్య­క్ర­మా­ల­కు దూ­రం­గా ఉం­టు­న్నా­రు. స్థా­నిక నా­య­కు­ల­తో సమా­వే­శా­లు లే­క­పో­వ­డం, పా­ర్టీ ప్ర­చార కా­ర్య­క్ర­మా­ల్లో కని­పిం­చ­క­పో­వ­డం వంటి అం­శా­లు క్యా­డ­ర్‌­లో అసం­తృ­ప్తి­ని పెం­చు­తు­న్నా­యి. మరి­కొం­ద­రు ఎమ్మె­ల్యే­లు బహి­రం­గం­గా­నే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ అభ్య­ర్థు­ల­కు సహ­క­రి­స్తా­మ­నే సం­కే­తా­లు ఇవ్వ­డం కాం­గ్రె­స్ అధి­ష్టా­నా­న్ని వి­స్మ­యా­ని­కి గురి చే­స్తోం­ది. ఇది ఒక్క­టి రెం­డు ని­యో­జ­క­వ­ర్గా­ల­కే పరి­మి­తం కా­కుం­డా, ఫి­రా­యిం­పు ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఇదే పరి­స్థి­తి కని­పి­స్తోం­ది.

కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. జగిత్యాల వంటి నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ కార్యకర్తలకు, కొత్తగా వచ్చిన నేతలకు మధ్య తీవ్ర సమన్వయ లోపం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులు, నిన్న మొన్నటివరకు ప్రత్యర్థిగా ఉన్న నేతల కింద పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతోంది. ఈ అంతర్గత విభేదాలు ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఆత్రుతలో, సరైన వడపోత లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News