టీఆర్ఎస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసొస్తుందన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గ్రేటర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. హైదరాబాద్లో ఉండే వివిధ మతాల వారిని, ప్రాంతాల వారిని సమదృష్టితో చూసే కాంగ్రెస్ను గెలిపిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతందన్నారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధంతా.. కాంగ్రెస్ హయంలోనే జరిగిందంటున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.