CONGRESS: మొదటి విడతలో "చేతి"కి చిక్కిన పల్లెలు

గెలుపు జోష్ కొనసాగించిన హస్తం పార్టీ

Update: 2025-12-12 04:00 GMT

తొలి విడత స్థా­నిక ఎన్ని­క­ల్లో అధి­కార హస్తం పా­ర్టీ జోరు చూ­పిం­చిం­ది. దా­దా­పు ప్ర­తి పల్లె­లో­నూ పాగా వే­సిం­ది.  తె­లం­గాణ స్థా­నిక సం­స్థల ఎన్ని­కల తొలి విడత ఫలి­తా­లు వె­లు­వ­డ్డా­యి.. ఈ యు­ద్ధం­లో అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ ఒక్క­టే జెం­డా ఎగు­ర­వే­సిం­ది. బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ అభ్య­ర్థు­లు చాలా చో­ట్ల డి­పా­జి­ట్ కో­ల్పో­యా­రు. ఈ ఫలి­తాల వె­నుక క్లి­య­ర్ గా సీఎం రే­వం­త్ రె­డ్డి పాలన మా­ర్క్ కని­పిం­చిం­ది.  ఎన్ని ఆర్థిక సవా­ళ్లు ఉన్నా.. సీఎం రే­వం­త్ సం­క్షేమ పథ­కాల వి­ష­యం­లో ప్ర­జల అం­చ­నా­ల­ను అం­దు­కు­న్నా­ర­నే అను­కో­వ­చ్చు. అధి­కా­రం­లో­కి వచ్చిన తొలి రో­జు­నే.. పరి­స్థి­తి ఏమి­టి... ఎలా అన్న­ది ఆలో­చిం­చ­కుం­డా ఉచిత బస్సు­ను ప్రా­రం­భిం­చే­శా­రు. ఎంత కష్ట­మై­నా భరిం­చక తప్ప­ద­న్న ఉద్దే­శం­తో ఆ పథకం ప్రా­రం­భిం­చా­రు. రెం­డే­ళ్లు­గా 90 శాతం మంది మహి­ళ­లు ఒక్క సారి అయి­నా ఈ పథకం ద్వా­రా లబ్ది­పొం­ది ఉం­టా­రు. పేద మహి­ళ­లు ఈ పథకం ద్వా­రా ఎంతో కొంత మి­గు­ల్చు­కుం­టా­రు. ఇక రై­తు­ల­కు రెం­డు లక్షల రు­ణ­మా­ఫీ జరి­గిం­ది. సి­లిం­డ­ర్ పథకం, రెం­డు వందల యూ­ని­ట్ల ఉచిత వి­ద్యు­త్ పథకం అమ­ల­వు­తోం­ది. ఈ పథకాలు కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థుల విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయి. సన్న­బి­య్యం పథకం మరో బెం­చ్ మా­ర్క్. రే­ష­న్ కా­ర్డు మీద సన్న­బి­య్యం పం­పి­ణీ చే­స్తు­న్నా­రు. ఇం­ది­ర­మ్మ ఇళ్ల­ప­థ­కా­న్నీ­అ­మ­లు చే­స్తు­న్నా­రు.  దీ­ని­తో పల్లె జనం కాం­గ్రె­స్ జెం­డా రె­ప­రె­ప­లా­డిం­ది. 


కాంగ్రెస్ లో స్థిరత్వం

కాం­గ్రె­స్ పా­ర్టీ­లో ఉన్న పరి­స్థి­తుల వల్ల తి­రు­గు­లే­ని నే­త­గా ఎద­గ­డా­ని­కి అవ­కా­శం ఉం­డ­దు. ఎప్ప­టి­క­ప్పు­డు కా­ళ్లు, చే­తు­లు కట్టే­స్తూ­నే ఉం­టా­రు. అయి­నా రే­వం­త్ తన పట్టు ని­రూ­పిం­చు­కుం­టూ­నే ఉన్నా­రు. జా­తీయ స్థా­యి­లో కాం­గ్రె­స్ పా­ర్టీ­కి అవ­స­ర­మై­న­ప్పు­డ­ల్లా అం­డ­గా ఉన్నా­రు. ఉప­రా­ష్ట్ర­ప­తి అభ్య­ర్థి­ని సమ­కూ­ర్చా­రు. జా­తీయ రా­జ­కీ­యా­ల­కు ఆయన వ్యూ­హా­లే ది­క్సూ­చీ అయ్యా­యి.  రెం­డే­ళ్ల­లో రెం­డు అసెం­బ్లీ స్థా­నా­ల­కు ఉపఎ­న్ని­క­లు జరి­గా­యి. రెం­డిం­టి­ని కాం­గ్రె­స్ ఖా­తా­లో వే­సు­కు­ని ఎమ్మె­ల్యేల  సం­ఖ్య­ను పెం­చు­కు­న్నా­రు.  ఎలా చూ­సి­నా..రెం­డే­ళ్ల పా­ల­న­లో రే­వం­త్ అద్భు­త­మైన వి­జ­యా­లు.. భయ­ప­డా­ల్సి­నంత పరా­జ­యా­లు ఏమీ చూ­డ­లే­దు.'అ­యి­తే ఈ వి­జ­యం గ్రే­ట­ర్ హై­ద­ర­బా­ద్ ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల్లో కొ­న­సా­గు­తుం­దా లేదా అన్న­ది మా­త్ర­మే ఇప్పు­డు ఉత్కం­ఠ­గా మా­రిం­ది. జీ­హె­చ్ఎం­సీ­లో కాం­గ్రె­స్ పా­ర్టీ ఒక్క ఎమ్మె­ల్యే స్థా­నం కూడా గె­ల­వ­లే­దు. అితే ఆ తర్వాత జరి­గిన కం­టో­న్మెం­ట్, జూ­బ్లీ­హి­ల్స్ ఎన్ని­క­ల్లో మా­త్రం గె­లి­చిం­ది.

Tags:    

Similar News