కానిస్టేబుల్‌ను బైక్‌తో ఢీకొట్టిన యువకుడు!
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ టోల్‌గేట్ దగ్గర ఓ బైకు ఢీకొట్టడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.;
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ టోల్‌గేట్ దగ్గర ఓ బైకు ఢీకొట్టడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తొండుపల్లి టోల్‌గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. పల్సర్ బైక్‌పై ఓ యువకుడు అతివేగంతో దూసుకొచ్చాడు. అతి గమనించిన కానిస్టేబుల్ వెంకటరమణ అతణ్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు వెంకటరమణను ఢీ కొట్టి పారిపోయాడు. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.