Harish Rao : అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా వేస్తాం : మంత్రి హరీశ్‌రావు
Harish Rao : అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా వేస్తామన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు . కొవాగ్జిన్ టీకాను కేంద్రం సూచించిందని పేర్కొన్నారు.;
Harish Rao : అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా వేస్తామన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు . కొవాగ్జిన్ టీకాను కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. జనవరి 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని పిల్లలకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు ప్రకటించారు. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకా వేస్తామన్నారు. కొవిన్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్, పురపాలికల్లో కొవిన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 87శాతం టీకాలు అందించిందన్నారు. ప్రైవేటు వైద్యశాలలు 13శాతం టీకాలు అందించాయన్నారు. టీకాల కొరత లేదని.. 30లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని హరీష్ రావు స్పష్టం చేశారు.