CRIME: బాలికను హత్య చేసింది పదో తరగతి విద్యార్థి

కూకట్‌పల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ.. సహస్రను చంపిన పదొవ తరగతి విద్యార్థి.. బాలిక ఇంటికి వెళ్లి రూ.80 వేలు దొంగతనం;

Update: 2025-08-23 02:45 GMT

ఆడ­పి­ల్ల పు­ట్ట­గా­నే ఆ తల్లి­దం­డ్రు­లు ఎంతో ము­రి­సి­పో­యా­రు. తమ ఇంట మహా­ల­క్ష్మి పు­ట్టిం­ద­ని ఎంతో సం­బ­ర­ప­డ్డా­రు. కా­ళ్లు కిం­ద­పె­డి­తే కం­ది­పో­తా­య­ని, కల­కా­లం సం­తో­షం­గా బ్ర­త­కా­ల­ని సహ­స్ర అని నా­మ­క­ర­ణం చే­శా­రు. అపు­రూ­పం­గా 10 ఏళ్లు­గా ము­రి­పెం­గా పెం­చు­కు­న్నా­రు. ప్ర­తి­రో­జు ఆ పా­ప­తో ఆడు­కు­ని రో­జూ­వా­రి కష్టా­న్ని మర్చి­పో­యే­వా­రు. అను­కో­కుం­డా పా­ఠ­శా­ల­కు ఆరో­జు సె­ల­వు కా­వ­టం.. ఈ లో­కం­లో ఆ చి­న్నా­రి­కి అదే చి­వ­రి రోజు అయ్యిం­ది. యము­డి రూ­పం­లో పక్కిం­టి పి­ల్లా­డు.. బా­లిక ఇం­ట్లో­కి ప్ర­వే­శిం­చి గొం­తు కోసి.. అత్యంత కి­రా­త­కం­గా 18 సా­ర్లు కత్తి­తో పొ­డి­చి కడ­తే­ర్చా­డు. చి­న్న సూది గు­చ్చు­కుం­టే­నే ఎంత వి­ల­వి­ల­లా­డి­పో­యే మనం పాపం ఆ చి­న్నా­రి భూమి నుం­చి వె­ళ్లి­పో­యే చి­వ­రి క్ష­ణా­ల్లో ఎంత నరకం అను­భ­విం­చిం­దో తల­చు­కుం­టే­నే కల­చి­వే­స్తోం­ది. సం­గా­రె­డ్డి జి­ల్లా ము­ని­ప­ల్లి మం­డ­లం ము­క్తా­క్యా­సా­రం గ్రా­మా­ని­కి చెం­దిన కృ­ష్ణ, రే­ణుక దం­ప­తు­లు ఐదే­ళ్లు­గా కూ­క­ట్‌­ప­ల్లి సం­గీ­త్‌­న­గ­ర్‌­లో ని­వా­సం ఉం­టు­న్నా­రు. కృ­ష్ణ మె­కా­ని­క్‌ షె­డ్డు­లో పని­చే­స్తుం­డ­గా, రే­ణుక ఓ ప్రై­వే­టు ఆసు­ప­త్రి­లో ల్యా­బ్‌ టె­క్నీ­షి­య­న్‌. ఈ దం­ప­తు­ల­కు సహ­స్ర(10), కు­మా­రు­డు(7) ఉన్నా­రు. క్రీ­డో­త్స­వాల నే­ప­థ్యం­లో బా­లిక పా­ఠ­శా­ల­కు వె­ళ్ల­కుం­డా ఇం­ట్లో ఒం­ట­రి­గా ఉం­డ­గా తమ్ము­డు పా­ఠ­శా­ల­కు వె­ళ్లా­డు. రో­జు­లా­గే దం­ప­తు­లు వారి వి­ధు­ల­కు వె­ళ్తూ.. తమ్ము­డి­కి లంచ్ తీ­సు­కె­ళ్ల­మ­ని చె­ప్పా­రు.

అయి­తే మ. 12 అయి­నా భో­జ­నం తీ­సు­కు­రా­లే­ద­ని స్కూ­ల్ సి­బ్బం­ది ఫోన్ చే­య­టం­తో హు­టా­హు­టీన తం­డ్రి ఇం­టి­కి వె­ళ్ల­గా వి­గ­త­జీ­వి­గా కు­మా­ర్తె మం­చం­పై కని­పిం­చిం­ది. భయ­భ్రాం­తు­ల­కు గురై కే­క­లు వే­య­టం­తో ఇరు­గు­పొ­రు­గు వారు పో­లీ­సు­ల­కు సమా­చా­ర­మి­చ్చా­రు. ఈనెల 18న మధ్యా­హ్నం సమ­యం­లో పక్కిం­ట్లో ఉన్న పదొవ తర­గ­తి వి­ద్యా­ర్థి సహ­స్ర ఇం­ట్లో­కి చొ­ర­బ­డ్డా­డు. రూ.80 వేల దొం­గి­లిం­చి తి­రి­గి వె­ళ్తుం­డ­గా సహ­స్ర చూసి దొం­గ­త­నం వి­ష­యం తల్లి­దం­డ్రు­ల­కు చె­బు­తా­న­ని హె­చ్చ­రిం­చిం­ది. దీం­తో నిం­ది­తు­డు సహ­స్ర గొం­తు ను­లి­మి తనతో తె­చ్చు­కు­న్న కత్తి­తో గొం­తు కోసి చని­పో­లే­దే­మో అనే ఉద్దే­శం­తో వి­చ­క్ష­ణ­ర­హి­తం­గా 18 సా­ర్లు కత్తి­తో దాడి చేసి సహ­స్ర­ను హత్య చేసి పరా­ర­య్యా­డు. గత ఐదు రో­జు­లు­గా అన్ని కో­ణా­ల్లో దర్యా­ప్తు చే­సి­నా పో­లీ­సు­ల­కు చి­న్న క్లూ కూడా దొ­ర­క­లే­దు. దీం­తో రం­గం­లో­కి ది­గిన ఎస్‌­వో­టీ బృం­దం పక్క ఇం­ట్లో నుం­చి చొ­ర­బ­డే అవ­కా­శం ఉన్న­ట్టు గు­ర్తిం­చా­రు. ఈ క్ర­మం­లో పక్క ఇం­ట్లో సో­దా­లు చే­య­గా రక్తం­తో ఉన్న బట్ట­లు, కత్తి, పే­ప­ర్‌­ను గు­ర్తిం­చా­రు. యధా­వి­ధి­గా శు­క్ర­వా­రం పా­ఠ­శా­ల­కు వె­ళ్లిన వి­ద్యా­ర్థి­ని పో­లీ­సు­లు ప్ర­శ్నిం­చ­గా పొం­తన లేని సమా­ధా­నా­లు చె­ప్ప­టం­తో తన దైన శై­లి­లో వి­చా­రిం­చి అసలు వి­ష­యా­న్ని రా­బ­ట్టా­రు.

Tags:    

Similar News