కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.;
కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీపీ.. వైరస్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మొద్దని.. 45 ఏళ్లు పైబడిన వారు టీకా వేసుకోవాలని సజ్జనార్ సూచించారు.