పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరిపై దానం నాగేందర్ ఫైర్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.... గోరంత సమస్యను కొండంతలు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని... ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు.;
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.... గోరంత సమస్యను కొండంతలు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని... ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. రేవంత్ కింద పనిచేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు సిగ్గు పడాలని అన్నారు. వీహెచ్ ఆరోగ్యంగా ఉండి ఉంటే.. ఈ పాటికే రేవంత్ దుమ్ము రేపే వారంటూ విమర్శించారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా... ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.