DGP: కంటతడి పెట్టిన తెలంగాణ డీజీపీ

హైదరాబాద్ సీపీగా సజ్జనార్ బాధ్యతల స్వీకరణ

Update: 2025-09-30 06:45 GMT

 దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ వన్ స్థానంలో ఉందని డీజీపీ జితేందర్అన్నారు. డీజీపీ జితేందర్ పదవి విరమణ కార్యక్రమం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జితేందర్.. తన తల్లిదండ్రులను గుర్తుచేసుకుని జితేందర్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను తల్లి, తండ్రిని ఇద్దరినీ కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. పోలీస్ శాఖలో ఇంత కాలం నాకు సహకరించిన ప్రతి పోలీస్‌ సిబ్బందికి ధన్యవాదాలు. 40 ఏళ్లలో 40 రోజులు కూడా సొంత రాష్ట్రానికి వెళ్లకుండా విధులు నిర్వహించాను. డీజీపీగా 14 నెలల నుంచి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా. నా తండ్రి మంచి విలువలు నేర్పాడు. ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి నా కుటుంబ సభ్యులు స్నేహితులు సహకరించారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారాయన.

సజ్జనార్ ఆన్ డ్యూటీ

హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కమాండో అండ్‌ కంట్రోల్‌ యూనిట్‌లో సీవీ ఆనంద్ నుండి సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఎండీ ఉన్న ఆయన్ని ప్రభుత్వం సీపీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు డ్యూటీలో భాగంగా ఆయన సాధారణ పౌరుడిలా బస్సులో ప్రయాణించడం నెట్టింట వైరల్‌ అయ్యింది.



Tags:    

Similar News