హుజూరాబాద్ ఉపఎన్నికల్లో వైరల్ అవుతున్న వాల్‌క్లాక్‌ల పంపిణీ..!
హుజూరాబాద్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి.;
హుజూరాబాద్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలను మచ్చిక చేసుకునేందుకు తాయిళాలు ఇస్తూ ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. తాజాగా ఉపఎన్నికలో ఓ పార్టీ తరఫున వాల్‌క్లాక్‌ల పంపిణీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రామంలో ఓ వ్యక్తి ఇంటింటికి వాల్‌క్లాక్‌లు పంపిణీచేస్తున్న తీరు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వాల్‌క్లాక్ పంచుతున్న వ్యక్తిని...స్థానికుడు వీడియో తీస్తూ ప్రశ్నించాడు. వాల్‌క్లాక్‌లు ఎక్కడవంటూ పంచుతున్న వ్యక్తిని నిలసేందుకు యత్నించాడు స్థానికుడు. ఆత్మగౌరవం అంటే ఇదేనా అని అడిగినా...మరోమాట మాట్లాడకుండా వాల్‌క్లాక్ పంచుతున్న వ్యక్తి జారుకున్నాడు. వాల్‌క్లాక్‌ల పంపిణీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్న వీడియో వైరల్‌గా మారుతోంది.
మరోవైపు మాజీ మంత్రి ఈటల సతీమణి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజీపీ అభ్యర్థిగా తానున్నా....లేక ఈటల రాజేందర్ ఉన్నా...ఒకటేనని గెలిచేది మాత్రం బీజేపీనేని జమున మాటలు ఆసక్తికరంగా మారాయి. రెండురోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరపున జమున ఇంటింటికి ప్రచారం చేస్తోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు అడుగడుగునా... ఇబ్బందులు సృష్టిస్తోందని జమున ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలు వాస్తవాలు తెలుసుకుని బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు ఈటల సతీమణి..