Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి..
Hyderabad: హైదరాబాద్ గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.;
Hyderabad: హైదరాబాద్ గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఒక్కసారిగా ఎగబడి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లినా ప్రయోజనంలేకపోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గతంలోనూ కూడా ఇదే ప్రాంతంలో వీధికుక్కలు బస్తీవాసులపై దాడికి పాల్పడిన ఘటనలున్నాయని స్థానికులు వాపోతున్నారు. పక్కనే ఖాళీగా ఉన్న మిలిటరీ ఏరియా నుండి శునకాలు బస్తీకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.