Harish Rao (File Photo)
దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్.. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంత్రి హరీష్ ఈ ఎన్నికలో గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తాజాగా హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నర్సింహారెడ్డి, మనోహర్ లు గులాబీ కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది అన్నారు హరీష్ రావు. దుబ్బాకలో టిఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్న ఆయన.. తొలిసారి ఓ మహిళ ఎమ్మెల్యే కానుంది. కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు..