ED CASE: రాణా, విజయ్ దేవరకొండపై ఈడీ కేసు

29 మంది సినీ ప్రముఖులపై కేసు నమోదు... బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు;

Update: 2025-07-10 07:30 GMT

బె­ట్టిం­గ్ యా­ప్‌­ల­ను ప్ర­మో­ట్ చే­స్తు­న్న వా­రి­పై ఈడీ దూ­కు­డు పెం­చిం­ది. మి­యా­పూ­ర్‌­కు చెం­దిన వ్యా­పా­ర­వే­త్త పి.ఎం. ఫణీం­ద్ర శర్మ ఫి­ర్యా­దు­తో ఈ కేసు నమో­దైం­ది. సో­ష­ల్ మీ­డి­యా ప్లా­ట్‌­ఫా­మ్స్, ఇన్‌­స్టా­గ్రా­మ్, ఫే­స్‌­బు­క్‌­ల్లో సె­ల­బ్రి­టీ­లు, ఇన్‌­ఫ్లూ­యె­న్స­ర్లు.. అక్రమ బె­ట్టిం­గ్ యా­ప్‌­ల­ను ప్ర­మో­ట్ చే­స్తు­న్నా­ర­ని ఫణీం­ద్ర శర్మ తన కం­ప్లైం­ట్‌­లో పే­ర్కొ­న్నా­రు. ఈ యా­ప్‌ల ద్వా­రా వేల కో­ట్ల రూ­పా­యి­లు చలా­మ­ణి అవు­తు­న్నా­య­ని.. దీ­ని­వ­ల్ల పేద, మధ్య­త­ర­గ­తి కు­టుం­బా­లు ఆర్థిక నష్టా­ల్ని ఎదు­ర్కొం­టు­న్నా­య­ని తె­లి­పా­రు. ఈ యా­ప్స్‌ ద్వా­రా సు­ల­భం­గా డబ్బు సం­పా­దిం­చ­వ­చ్చ­ని ఆశ చూ­పిం­చి ప్ర­జ­ల­ను బె­ట్టిం­గ్స్‌­కు బా­ని­స­ల­న్ని చే­స్తు­న్నా­ర­న్నా­రు. దీం­తో హై­ద­రా­బా­ద్ పో­లీ­సు­లు నమో­దు చే­సిన ఎఫ్ఐ­ఆ­ర్ ఆధా­రం­గా కేసు నమో­దు చేసి సె­ల­బ్రి­టీ­లు, యూ­ట్యూ­బ­ర్స్, ఇన్‌­ఫ్లూ­యె­న్స­ర్ల­పై పీ­ఎం­ఎ­ల్ఏ కింద వి­చా­రిం­చ­ను­న్నా­రు. బీ­ఎ­న్‌­ఎ­స్‌­లో­ని 318(4), 112, రె­డ్‌­వి­త్‌ 49, తె­లం­గాణ గే­మిం­గ్‌ యా­క్ట్‌­లో­ని 3, 3(ఎ), 4 సె­క్ష­న్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సె­క్ష­న్ల కింద కేసు నమో­దైం­ది. ఈ యా­ప్స్ ప్ర­మో­ష­న్ కోసం భా­రీ­గా కమీ­ష­న్, పా­రి­తో­షి­కం తీ­సు­కు­న్నా­ర­ని పలు­వు­రు పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­రు. ఈ యా­ప్‌ల కా­ర­ణం­గా అప్పు­ల­పా­లై అనేక మంది ఆత్మ­హ­త్య­లు చే­సు­కో­గా, చాలా కు­టుం­బా­ల్లో ఆర్థిక సం­క్షో­భం నె­ల­కొం­ద­ని పో­లీ­సు­లు ఎఫ్‌­ఐ­ఆ­ర్‌­లో పే­ర్కొ­న్నా­రు.ఈడీ మె­ు­త్తం 29 మంది సినీ ప్ర­ము­ఖు­ల­తో పాటు.. వి­విధ కం­పె­ల­పై­నా కేసు నమో­దు చే­సిం­ది. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈడీ ఒక్కసారిగా కేసు నమోదు చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త కలకలం ఆరంభమైంది. దీనిపై ఎవ్వరూ అధికారికంగా స్పందించలేదు.

సెలబ్రెటీలపై ఈడీ దూకుడు

కేసు నమో­దైన వా­రి­లో.. ప్ర­కా­ష్ రాజ్, నిధి అగ­ర్వా­ల్, వి­జ­య­దే­వర కొండ, శ్రీ­ము­ఖి, రానా, మంచు లక్ష్మీ, అన­న్యా నా­గ­ళ్ల, సిరి హను­మం­తు, వర్షి­ణి సౌం­ద­రా­జ­న్, వసం­తి కృ­ష్ణ­న్, శోభా శె­ట్టి, అమృత చౌ­ద­రి, నయని పా­వ­ని, నేహా పఠా­న్, పండు, పద్మా­వ­తి, ఇమ్రా­న్ ఖాన్, వి­ష్ణు ప్రియ, హర్ష సాయి, సన్నీ యా­ద­వ్, శ్యా­మల, టే­స్టీ తేజ, బం­డా­రు శే­ష­యా­ని సు­ప్రీ­త­లు ఉన్నా­రు. వీ­రి­లో కొం­ద­రు యూ­ట్యూ­బ­ర్లు, సో­ష­ల్ మీ­డి­యా ఇన్‌­ఫ్లూ­యె­న్స­ర్లు కూడా ఉన్నా­రు. హై­ద­రా­బా­ద్, సై­బ­రా­బా­ద్ పో­లీ­సు­లు నమో­దు చే­సిన ఎఫ్ఐ­ఆ­ర్ ఆధా­రం­గా కేసు నమో­దు చే­శా­రు. గతం­లో వీ­రి­పై సై­బ­రా­బా­ద్ పో­లీ­సు­లు నమో­దు చే­సిన ఎఫ్‌­ఐ­ఆ­ర్‌ ఆధా­రం­గా ఈడీ దర్యా­ప్తు­ను చే­ప­ట్టిం­ది. అయి­తే యా­ప్‌ ప్ర­మో­ష­న్‌­కు సం­బం­ధిం­చి ఐటీ రి­ట­ర్న్‌­లో లె­క్క­లు చూ­పిం­చ­డం లే­ద­న్న ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. దీం­తో మనీ లాం­డ­రిం­గ్‌ కింద ఈడీ కేసు నమో­దు చే­సిం­ది. తె­లం­గాణ గే­మిం­గ్ చట్టం, ఐటీ చట్టం­లో­ని వి­విధ సె­క్ష­న్ల కింద హై­ద­రా­బా­ద్ పో­లీ­సు­లు కేసు నమో­దు చే­య­గా.. ఇప్పు­డు ఈడీ దర్యా­ప్తు­తో ఈ కేసు బలం­గా మా­రిం­ది.

Tags:    

Similar News