Eetela Rajender Assets : ఈటల ఆస్తులు, అప్పులు, కేసులు ఇవే..!
Eetela Rajender Assets : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులు వివరాలను వెల్లడించారు.;
Eetela Rajender Assets : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులు వివరాలను వెల్లడించారు. ఈటెల దంపతులకు 54 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు..ఈటెల రాజేందర్ పేరు మీద 12 కోట్ల 56 లక్షల 20 వేల 97 విలువ గల స్థిర, చరాస్థులున్నట్టు వెల్లడించారు. ఇందులో 7.5 కోట్ల విలువ గల నివాస గృహాలు, 2.5 కోట్ల వాణిజ్య భవనం.. 2.5 కోట్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు చూపించారు.
వీటితో పాటు ఈటెల రాజేందర్‌కు 3 కోట్ల 62 లక్షల 42 వేల 168 అప్పులున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 19 కేసులు నమోదు కాగా.. ఇప్పటికీ 5 కేసుల విచారణ పెండింగులో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈటెల రాజేందర్ భార్య ఈటల జమున పేరు మీద 43 కోట్ల 47 లక్షల 5వేల 894 విలువ గల చర, స్థిరాస్తులున్నట్లు చూపారు. ఇందులో 3 కోట్ల విలువ చేసే వాణిజ్య భవనాలు.. 2 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూమి, 9 కోట్ల 78 లక్షల 84 వేల విలువ గల వ్యవసాయ భూమి ఉందని, అలాగే 4 కోట్ల 89 లక్షల 77 వేల 978ల అప్పులు కూడా ఉన్నాయని జమున స్పష్టం చేశారు.
మరోవైపు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట నర్సింగరావు ఆస్తుల అఫిడవిట్‌ను అధికారులు విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడివెట్‌లో వెంకట్ తో పాటు అతని కుటుంబ సభ్యుల పేరిట 3 కోట్ల 76 లక్షల 93 వేల 597.05 విలువ గల స్థిర, చరాస్థులు ఉన్నాయని అలాగే కోటి 45 లక్షల 242 అప్పులు ఉన్నట్లు తెలిపారు.. ఇప్పటి వరకు బల్మూరి మీద 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు.
అతని వద్ద 48 వేల 525 నగదు .. 44 లక్షల 51 వేల 086.56 చరాస్తి ఉండగా, ఇందులో 22 లక్షల 19 వేల 448 విలువ గల 46.2 తులాల బంగారు ఆభరణాలు.. 14.50 లక్షల విలువ గల ఒక టాటా సఫారీ వాహనం ఉన్నట్లు తెలిపారు. 15 లక్షల విలువ గల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కోటి నలభై ఐదు లక్షల రెండు వందల నలబై మూడు రూపాయల అప్పు ఉన్నట్లు తెలిపారు. అలాగే, తల్లి బల్మూరి పద్మ పేర 28 కోట్ల 93 లక్షల 310.49 చరాస్థులు చూపగా.. 95 వేల 300 నగదు .. 14 లక్షల 81 వేల 726 విలువ చేసే 30.85 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. 2 కోట్ల70 లక్షల 49 వేల 200 విలువ చేసే స్థిరాస్తి.. కోటి ముప్పై ఒక లక్షల తొంభై ఐదు వేల నలభై తొమ్మిది రూపాయల అప్పు ఉన్నట్లు ఆఫిడవిట్ వెల్లడించారు.
ఇక అధికార టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 22 లక్షలుచర స్థిర ఆస్తులు ఉన్నాయని ఆఫిడవిట్‌లో తెలిపారు. తనకు సొంత వాహనము లేదని .. ఉద్యమ సమయంలో 5 కేసుల్లో విచారణ సాగుతుందని శ్రీనివాస్ వెల్లడించారు.