సిద్ధిపేట మున్సిపాల్టీలో జోరుగా ఎన్నికల ప్రచారం ..!
సిద్ధిపేట మున్సిపాల్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.;
సిద్ధిపేట మున్సిపాల్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున మంత్రి హరీష్‌రావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరిస్తున్న హరీష్... సిద్ధిపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు.
ఇక అటు బీజేపీ అభ్యర్థుల తరపున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ పాలన అంతా బూటకమేనని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హడావుడిగా కొన్ని వార్డుల్లో రోడ్లు వేశారని... ఓటర్లను ఆకర్షించేందుకు ఇలాంటి పనులు చేస్తోందని రఘునందన్ విమర్శించారు.