Nizamabad: ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీ పేలడంతో..
Nizamabad: ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.;
Nizamabad: ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ సుభాష్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి పడుకున్నారు. ఆ తర్వాత అది పేలిపోయింది. ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏదోఒక చోట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలో మంటలు రావడం.. ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే తమిళనాడులోని వేలూరులో ఛార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రికూతురు మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే నిజామాబాద్‌లో మరొకటి చోటుచేసుకుంది.