ENCOUNTER: ఆత్మరక్షణ కోసమే రియాజ్ ఎన్కౌంటర్: డీజీపీ
రియాజ్ ఎన్‌కౌంటర్‌తో సంబరాలు చేసుకున్న పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్‌ను నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. గది బయట కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడని డీజీపీ తెలిపారు. అనంతరం పోలీసులపై కాల్పులు జరిపేందుకు రియాజ్ ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నిందితుడిపై కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ కాల్పుల్లో రౌడీ షీటర్ రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ రియాజ్ కాల్పులు జరిపి ఉంటే ఆస్పత్రిలో ఉన్న చాలా మంది ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకే పోలీసులు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారని డీజీపీ తెలిపారు. అయితే మొదట రియాజ్ కాల్పులు జరపగా ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా పోలీసులు నింధితునిపై కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు.
రియాజ్ మరో దాడి
కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపిన రియాజ్, ఆసిఫ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే రియాజ్‌కు కూడా గాయాలు కావడంతో అతడిని పోలీసులు పట్టుకుని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులపై కూడా అతడు దాడికి యత్నించడంతో ఎన్కౌంటర్ అయిపోయాడు. రియాజ్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. అరెస్ట్ సమయంలో రియాజ్‌ను ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించినా సంయమనంతో కాల్పులు జరపలేదని నిజమామాబాద్ సీపీ తెలిపారు. తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.
ఎన్కౌంటర్లో హతం
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కానిస్టేబుల్ హత్య కేసులో ఆదివారం అరెస్టు అయిన రియజ్ , ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరుగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్సరే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపాడు. ఇప్పటికే వైలెంట్ ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్‌ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. అరెస్ట్ సమయంలో రియాజ్‌ను ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించినా సంయమనంతో కాల్పులు జరపలేదని నిజమామాబాద్ సీపీ తెలిపారు. గన్‌తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ రియాజ్‌ను ఎన్కౌంటర్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.