తెలంగాణ యూనివర్సిటీలో ఈడీ సోదాలు కలకలం
నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు కలకలం రేపుతున్నాయి.;
నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. అకౌంట్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్డింగ్, ఏవో కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. వర్సిటీ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామకాలలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 20 మందితో కూడిన విజిలెన్స్ బృందాలు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నాయి.