మహబూబ్‌నగర్‌ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్‌ రాజీనామా

మహబూబ్‌నగర్‌ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్‌ రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో మనస్పర్థలు రావడంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

Update: 2020-12-20 07:42 GMT

మహబూబ్‌నగర్‌ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్‌ రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో మనస్పర్థలు రావడంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తనే స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసిన ఆయన రాజీనామా విషయం తెలిపి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాననడం చర్చనీయాంశంగా మారింది. ఎర్ర శేఖర్ నిర్ణయం వెనక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటన కారణమన్న ప్రచారం జరుగుతోంది.

జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఆ సమయంలో తనకు కాస్త అవమానం జరిగినట్టు ఆయన భావిస్తున్నారని ప్రచారం ఉంది. తరువాత ప్రెస్ మీట్ విషయంలోనూ ఎర్ర శేఖర్ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు సీనియర్లు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడి ప్రెస్ మీట్ చివరి క్షణంలో క్యాన్సల్ అయ్యేలా చేశారు.

బీజేపీ సీనియర్ నేతల కారణంగానే ప్రెస్ మీట్ క్యాన్సల్ అయినట్టు ఆయన భావిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో తీవ్ర మనస్తాపానికి లోనైన శేఖర్ రాజీనామా చేసినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లా బీజేపీలో సీనియర్ నేతలకు, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకు మధ్య పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

Tags:    

Similar News