Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు: జమున
Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన భార్య ఈటల జమున.;
Etela Jamuna : రాజకీయ అక్కసుతోనే మాజీ మంత్రి ఈటలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన భార్య ఈటల జమున. 2004 నుంచి ఈటల రాజకీయాల్లో ఉన్నారని, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారికైనా ఫోన్ చేశారా అని ప్రశ్నించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు పెడుతామని హెచ్చరించారు. కలెక్టర్ హోదా మరచి మాట్లాడారని ఆరోపించారు. సర్వే నంబర్ 81లో 5 ఎకరాల 30 గుంటలు, 130 సర్వే నంబర్‌లో 3 ఎకరాలు ఉంటే 70 ఎకరాలు ఆక్రమించామనడం ఏంటన్నారు. 2018లోనే భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా హేచరిస్ ఏ అనుమతులైతే ఉన్నాయో...తమకు అవే పర్మిషన్స్ ఉన్నాయన్నారు. ఈటలను రోడ్డున వేయాలన్నదే కేసీఆర్ టార్గెట్ అన్నారు జమున. తన బండారాన్ని ఈటల బయటపెడతాడని...కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం మొత్తం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదన్నారు జమున.