Huzurabad By Election : బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున పేరుతో నామినేషన్ దాఖలు..!
Huzurabad By Election : హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పేరుతో నామినేషన్ దాఖలయ్యింది;
హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పేరుతో నామినేషన్ దాఖలయ్యింది. బీజేపీ అభ్యర్థిగా జమున వర్గీయులు ఈ నామినేషన్ వేశారు. అటు.. ఈటల రాజేందర్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. చివరి రోజు 8వ తేదీన నామినేషన్ వేసేందుకు ఈటల సిద్ధమవుతున్నారు. జమున పేరుతో ముందు జాగ్రత్తగా నామినేషన్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.