Etela Rajendar : నేను ఏనాడు చిల్లర రాజకీయాలు చేయలేదు : ఈటల
Etela Rajendar : హుజురాబాద్ ఎన్నికల శంఖారావం సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు.;
Etela Rajendar : హుజురాబాద్ ఎన్నికల శంఖారావం సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ నేతలు.. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ నేతలు ..స్వీయ మానసిక ధోరణిని ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ఏనాడు చిల్లర రాజకీయాలు చేయలేదని ఈటల స్పష్టం చేశాడు. ఫేక్ లెటర్లు సృష్టించి.. బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో.. ఇప్పటికే మద్యం సీసాలతో పాటు వందల కోట్లు చేశారన్నారు. అధికార టీఆర్‌ఎస్ కుట్రలకు.. ప్రజలే తగిన సమాధానం చెబుతారని తెలిపారు. 2023 ఎన్నికల్లో.. తెలంగాణ గడ్డపై ఎగరబోయేది కాషాయ జెండా అని ఈటల పేర్కొన్నారు.