తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మల్కాజ్గిరి MP ఈటల రాజేందర్. హిందూ దేవాలయాల మీద కుట్ర ప్రకారమే దాడి జరుగుతోందన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టంలో మార్పులు తెస్తామని చెప్పిన తరవాత, యువకుల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చిల్లర రాజకీయాల చేస్తే జరిగే పరిణామాలను ఊహించలేరని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.