ఈటలకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావని టీఆర్‌ఎస్ ప్రచారం: రాజేందర్
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీ...అధికార బలంతో అడ్డదార్లు తొక్కుతోందని బీజీపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు.;
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీ...అధికార బలంతో అడ్డదార్లు తొక్కుతోందని బీజీపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. స్థానిక నాయకులను ప్రలోభపెట్టడమేగాక...టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ఆర్డీవో కేంద్రంగా దొంగఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నా...అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదని ఈటల ఆరోపించారు ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తే...సంక్షేమ పథకాలు రావని టీఆర్‌ఎస్ ప్రచారాన్ని ఖండించిన ఈటల... కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు...వచ్చేనెల 13 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు..