బ్రేకింగ్.. మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఎక్కడైనా ఏ నాయకుడైనా అండగా ఉంటారని చెప్పుకొచ్చారు ఈటల.;
టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఇచ్చే గుర్తింపు కార్డును చూపిస్తే పోలీసులు కూడా అడ్డుచెప్పరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల కోసం బాగా కష్టపడేవారికి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఎక్కడైనా ఏ నాయకుడైనా అండగా ఉంటారని చెప్పుకొచ్చారు ఈటల.