HARISH: సీఎం రేవంత్‌కు హరీశ్‌ బహిరంగ సభ

సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని డిమాండ్‌... రేవంత్ మాట తప్పుతున్నారని ఆగ్రహం;

Update: 2025-02-10 03:30 GMT

సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతు పండించిన అన్ని పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం... నేడు ఆ మాట తప్పుతోందని హరీష్ మండిపడ్డారు. అన్ని పంటలకు బదులు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారని, మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల దాన్యానికి సంబందించిన రూ.432 కోట్లు బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. వరి దాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నా ఇంతవరకూ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదన హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో రంగంలోకి కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగుతున్నారని హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ రంగంలోకి దిగితే సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేరన్నారు. ఈ నెలాఖరులో పబ్లిక్ మీటింగ్ ప్లాన్ చేశామని.. అందులో కేసీఆర్ తప్పకుండా పాల్గొంటారని చెప్పారు. ఇక తామంతా కేసీఆర్ మార్గదర్శకత్వంలో ముందుకెళ్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.

వాళ్లకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి: హరీశ్ రావు

బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన శ్రీ కృష్ణ యాదవ ఫంక్షన్ హాలులో సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఫంక్షన్‌కు వచ్చే డబ్బులను పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాలి. KCR ఎంతోమంది యాదవులకు MLA సీట్లు ఇచ్చారు. కానీ వాళ్లకు కాంగ్రెస్ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’”. అని హరీష్ పేర్కొన్నారు. ‘సిద్దిపేటలోని కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు అండగా ఉంటానని ఆనాడు రేవంత్‌రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహారదీక్ష చేపట్టారు. ఆ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సీఎంగా ఉన్న మీపై ఉంది. BRS హయాంలో R&B ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు 90% పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులను పూర్తి చేయండి. ’ అని లేఖలో రాశారు.

Tags:    

Similar News