Revanth Reddy: రేవంత్ అసత్యాలు మాట్లాడారు..! పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే..
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి భగ్గుమన్నారు.;
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి ప్రాంగణంలో అత్యాచారం జరిగిందంటూ.. రేవంత్ అసత్యాలు మాట్లాడారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఘటన జరిగిందని మాట్లాడారన్నారు. దేవాలయంలో ఆ ఘటన జరగలేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షరాలా తప్పన్నారు. దేవాలయంపై వ్యాఖ్యలు చేస్తే ఫౌండర్ ఛైర్మన్‌గా ఊరుకునేది లేదన్నారు.