సైబరాబాద్‌లో ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ అరెస్ట్
నకిలీ ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని;
సైబరాబాద్‌లో ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 50వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్‌లను SOT స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ చేయిస్తామని నమ్మిస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్ల సాయంతో ఇన్సూరెన్స్ చేయిస్తామంటూ మోసాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.