నిర్మల్ జిల్లా పొన్కల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ను అడ్డుకున్న రైతులు
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. సదర్ మార్ట్ బ్యారేజ్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.;
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. సదర్ మార్ట్ బ్యారేజ్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. రైతు వేదిక ప్రారంభోత్సవానికి వెళ్లకుండా ఇంద్రకరణ్‌రెడ్డిని అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు రైతుల్ని కట్టడి చేయడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు.