తనపై జరిగిన దాడిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సిద్ధమవుతున్నారు. అసిఫ్‌నగర్‌లో సీసీ రోడ్డు పనులు పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లడంతో వివాదం తలెత్తింది. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేస్ అనుచరులు ఫిరోజ్ పై దూసుకెళ్లారు. కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. ఈ ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు.