టీవీ-5, హిందూ ధర్మం ఛానళ్ల ఛైర్మన్ నాయుడు స్ఫూర్తితో దాతృత్వం
టీవీ-5 ఛైర్మన్ నాయుడు స్ఫూర్తితో ఉపాధ్యాయులకు నిత్యావసరాలు పంపిణీ చేశామని విశ్వభారతి స్కూల్ యాజమాన్యం తెలిపింది.;
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ విశ్వభారతి స్కూల్ దాతృత్వం చాటుకుంది. కరోనా కారణంగా పాఠశాలలు నడవక.. ఆదాయం కోల్పోయిన 50 మంది టీచర్లకు నిత్యావసరాల పంపిణీ చేసింది. ఒక్కో ఉపాధ్యాయునికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాల అందచేసింది. పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులు కృతజతలు తెలిపారు. ఇటీవల ఉద్యోగం కోల్పోయిన లెక్చరర్‌కు టీవీ-5, హిందూ ధర్మం ఛానళ్ల ఛైర్మన్ నాయుడు లక్ష రూపాయల సాయం చేశారు. టీవీ-5, హిందూ ధర్మం ఛానళ్ల ఛైర్మన్ నాయుడు స్ఫూర్తితో ఉపాధ్యాయులకు నిత్యావసరాలు పంపిణీ చేశామని విశ్వభారతి స్కూల్ యాజమాన్యం తెలిపింది.