శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది.;
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న ఇద్దరి నుంచి ఈ కరెన్సీను అధికారులు సీజ్ చేశారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా... తినుబండారాల్లో అమలర్చి తీసుకెళ్లేందుకు యత్నించారు. అనుమానంతో వారి బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కరెన్సీ బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఇద్దర్ని నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.