వర్షాకాలం వస్తోంది నాలాల పనులు శరవేగంగా చేయాలి: మేయర్‌ విజయలక్ష్మి

హైదరాబాద్‌ బేగంపేట్‌ బ్రాహ్మణ వాడి ప్రాంతంలో ఎమ్మెల్సీ వాణి దేవితో కలిసి నాలా పనులను పరిశీలించిన మేయర్

Update: 2023-05-29 13:26 GMT

వర్షా కాలం దృష్టిలో పెట్టుకుని నాలాల పనులను శరవేగంగా పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ బేగంపేట్‌ బ్రాహ్మణ వాడి ప్రాంతంలో ఎమ్మెల్సీ వాణి దేవితో కలిసి నాలా పనులను పరిశీలించిన మేయర్.. కూకట్ పల్లి నాలాను ఆనుకొని ఉన్న బ్రాహ్మణ వాడి, మయూర్ మార్గ్, ప్రకాష్ నగర్, అల్లంతోట బావి ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. ముంపు నివారణకు 45 కోట్లతో ఎస్ఎన్‌డిపి కింద పనులను చేపట్టామన్నారు. ఇక నాలాల రిటైనింగ్ వాల్స్ మరమ్మతులతో పాటు కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు మేయర్ విజయలక్ష్మి.

Tags:    

Similar News