హైదరాబాద్ గోషామహల్‌లో నాలా రోడ్డు భారీగా కుంగింది. దారుసలామ్ రోడ్డు నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ఫ్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరతి 2గంటల ప్రాంతంలో సివరేజ్ పెద్ద నాలా కుప్పకూలింది. అర్ధరాత్రి కావడంతో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతిపురాతనమైనా నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. 200 మీటర్ల దూరంలోనే గతంలో కూడా ఇదే నాలా కుంగింది. కుంగిన నాలాను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరిశీలించారు. అధికారులను సత్వర చర్యలకు ఆదేశించారు.