New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు విధివిధానాలు రేపు ఖరారు

Update: 2024-07-31 06:49 GMT

కొత్త రేషన్ కార్డుల జారీపై గురువారం జరిగే మంత్రి మండలి సమావేశంలో విధివిధానాలు ఖరారు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) ప్రకటించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 91,68,291 రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రస్తుతం కార్డుల సంఖ్య 89 లక్షల 96 వేలు అని తెలిపారు.

ఈ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి రూ.500 బోనస్ చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. శాసన సభలో పౌరసరఫరాలశాఖకు సంబంధించిన పద్దుపై మాట్లాడిన మంత్రి ఉత్తమ్ చౌకధరల దుఖానాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయని కొందరు దళారులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బహిరంగమార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదులపై విచారణ జరిపామని, ఇది నిజమని తేలిందని చెప్పారు.

సన్న బియ్యాన్ని ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేస్తున్నామని, భవిష్యత్లో పేదలందరికీ ఈ బియ్యాన్ని సరఫరాచేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్కార్డు ఒకటి కూడా ఇవ్వలేదని, పేదలు ఎంతో ఇబ్బందిమ పడ్డారని ఆరోపించారు. మంత్రి మండలి సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయడంతోపాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News