రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలి : హరీష్ రావు
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని స్థానిక మార్కెట్ యార్డులో భూసార పరీక్ష ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.;
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మంచి ధర ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని స్థానిక మార్కెట్ యార్డులో భూసార పరీక్ష ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. రైతులకు అవసవరమైన సమాచారం అందించేందుకు రైతుల వేదికలు ఉపయోగపడుతున్నాయన్నారు. భూసార పరీక్షలు చేయించి రైతులకు సమగ్ర సమాచారంతో భూరికార్డులు అందజేస్తామన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల పంటలకు లాభం జరుగుతుందని కేంద్రం చెబుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో సహకరిస్తున్నారని హరీష్ పేర్కొన్నారు.