Harish Rao : వాళ్లని చెరువులో ముంచాలి : హరీష్ రావు

Harish Rao : బీజేపీ, కాంగ్రెస్‌పై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు;

Update: 2022-09-07 13:17 GMT

Harish Rao : బీజేపీ, కాంగ్రెస్‌పై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్దన్ పేటలో నూతన ఆసరా పెన్షన్లను ఆయన పంపిణీ చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీళ్లు రాలేదన్న కేంద్ర మంత్రులకు హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఒకరు ఢిల్లీలో.. మరొకరు హైదరాబాద్‌ గల్లీల్లో మాట్లాడుతారని చురకలంటించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను చెరువులో ముంచాలని ప్రజలకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News