50వేల ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిధ్ధం: హరీశ్ రావు‌

ఇప్పటివరకు లక్షా 28వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.;

Update: 2021-01-05 11:28 GMT

తెలంగాణ ఉద్యమం ప్రజల మధ్య ఐక్యత తీసుకువచ్చిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ తెలిపారు. తెలంగాణ భవన్ లో ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీ -2021ను ఆయన ఆవిష్కరించారు. 2008లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం పుట్టిందని.. కనీస వేతనాల అమలు, నూతన ఉద్యోగాల కోసం పోరాడారని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉందని.. ఇప్పటివరకు లక్షా 28వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 50వేల ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చాయన్నారు. ప్రపంచంలోని బడా కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడుటు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని హరీష్ వెల్లడించారు.

Tags:    

Similar News