మెదక్‌లో మంత్రి హరీష్ రావు పర్యటన
మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.;
మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో యాగశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.