సింగూరులో గంగమ్మకు పూజలు చేసిన మంత్రి హరిష్‌

Update: 2020-10-15 10:36 GMT

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును సందర్శించారు మంత్రి హరీష్‌. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి సింగూర్‌లో గంగమ్మకు పూజలు చేశారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో వివరాల గురించి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో రివ్యూ చేశారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై రిపోర్ట్‌ అందజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో.. 45 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.


Similar News