ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైవేపైకి వరద పొటెత్తింది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
అనేక గ్రామాల పరిధిలో రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. గరిష్టంగా సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో 27.3cm వర్షపాతం నమోదైంది. మూసి ప్రవాహం భారీగా పెరిగింది.