Rains in Telangana : హైదరాబాద్ సహా తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Update: 2024-08-09 08:58 GMT

తెలంగాణలో రెండురోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యా పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆయా జిల్లాలకు వాతా వరణశాఖ ఎల్లో అలెర్టు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంలో కనిపిస్తోందని పేర్కొంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ ఆవర్తనం గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా వద్ద సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు సమాచారం.

దీని ప్రభావంతో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.

Tags:    

Similar News