Heavy Rainfall : తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Update: 2025-07-17 08:15 GMT

తెలంగాణకు వాతావరణ శాఖ వర్షసూచన చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో, శుక్రవారం మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. కాగా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి రుతుపవనాలు త్వరగానే వచ్చినా వర్షాలు మాత్రం ఆశించినంతగా పడడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ కబురు రైతులకు గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు.

Tags:    

Similar News