Hyderabad Rains : హైదరాబాదుకి మరోసారి భారీ వర్ష సూచన..!

మరోవైపు తెలంగాణ పక్కనే ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం, భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది

Update: 2021-09-06 12:15 GMT

హైదరాబాద్ లో మూడ్రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. బంగాళాఖాతం తూర్పు, మధ్యప్రాంతంలో 4.3 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

మరోవైపు తెలంగాణ పక్కనే ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం, భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వివరించింది. ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.

Tags:    

Similar News