హైదరాబాద్‌లో అక్రమనిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం.. !
హైదరాబాద్‌లో అక్రమనిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ సీరియస్ అయింది.;
హైదరాబాద్‌లో అక్రమనిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ సీరియస్ అయింది. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది ధర్మాసనం. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అక్రమనిర్మాణాలు జరుగుతున్నాయని అనేకమంది కోర్టుకు వస్తున్నారని వీటికి అడ్డుకట్టపడాల్సిందేని స్పష్టం చేసింది హైకోర్టు. అక్రమనిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించిన హైకోర్టు.. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని వ్యాఖ్యానించింది. స్టేలు తొలగించాలని కోర్టుల్లో పిటిషన్లు ఎన్ని వేశారో చెప్పాలన్నారు. స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు తెలిపాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. అనంతరం విచారణ 15కు వాయిదా వేసింది.