Telangana High court : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టులో విచారణ

Telangana High court : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Update: 2021-06-22 10:15 GMT

Telangana High court : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ పిల్‌పై హైకోర్ట్‌ విచారణ చేసింది. ఈ సందర్భంగా అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకున్నామని.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జీవో నెంబర్‌ 46ను ఉల్లంఘించిన పాఠశాలలకు నోటీసులు ఇచ్చామని తెలిపింది. ఇక 4వారాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామంది. అయితే సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలు తమ పరిధిలోకి రాకపోవడం వల్ల.. సంబంధిత బోర్డుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంది. ప్రభుత్వ వివరణ నమోదు చేసుకున్న హైకోర్టు.. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ పాఠాలపై విచారణ అవసరం లేదన్న హైకోర్ట్‌.. పిల్‌పై విచారణ ముగించింది.

Tags:    

Similar News