హైదరాబాద్‌ : జలదిగ్భందంలో 1500 కాలనీలు

Update: 2020-10-14 08:06 GMT

హైదరాబాద్‌లో దాదాపు 1500 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అన్ని చోట్లా ఇళ్లలోకి నీరు చేరింది. హైదరాబాద్‌కి వచ్చే ప్రధాన రహదారులు కూడా దెబ్బతినడంతో ట్రాఫిక్‌ ఎక్కడిక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇవాళ, రేపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అన్నింటికీ సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీర్‌పేట్‌ అయోధ్య కాలనీలోకి వరద నీరు పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. నిత్యావసర సరకులు కొట్టుకుపోయాయి. వరద గుప్పిట చిక్కుకున్న తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.  

Tags:    

Similar News