Hyderabad Metro: రాయదుర్గం- శంషాబాద్‌కు మెట్రో.. శంకుస్థాపన చేసిన కేసీఆర్
Hyderabad Metro: ఎయిర్‌పోర్ట్ మెట్రోకు మైండ్ స్పేస్ జంక్షన్‌లో శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్.;
Hyderabad Metro: ఎయిర్‌పోర్ట్ మెట్రోకు మైండ్ స్పేస్ జంక్షన్‌లో శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. మంత్రులు కేటీఆర్.. తలసాని, మల్లారెడ్డి, GHMC మేయర్, ఎమ్మెల్యేలు..DGP మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు.
రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్ మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్‌కాగా.. విమానాశ్రయం దగ్గర్లో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు. మిగతా కిలోమీటరు మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 స్టేషన్లు ఉండనున్నాయి.