Hyderabad Traffic Challan: చలాన్ల క్లియరెన్స్‌లో రికార్డ్.. 15 రోజుల్లో 130 కోట్లు..

Hyderabad Traffic Challan: తెలంగాణలో పెండిగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వస్తోంది.;

Update: 2022-03-17 06:56 GMT

Hyderabad Traffic Challan: తెలంగాణలో పెండిగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వస్తోంది. గత పదిహేను రోజుల్లో ఏకంగా కోటి 30 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు 15 రోజుల్లో 130 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఒక్క హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచే 80 శాతం ట్రాఫిక్‌ చలానాలు క్లియర్‌ అయ్యాయి.

ఇప్పటి వరకు 500 కోట్ల విలువైన చలానాలకు రాయితీ ప్రకారం 130 కోట్లు వసూలయ్యాయని పోలీసులు తెలిపారు.పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాల ద్వారా మొత్తంగా 300 కోట్లు వసూలయ్యే అవకాశాలున్నాయన్నారు.ఈ అవకాశం ఈ నెల 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రాగా 31 వరకు అందుబాటులో ఉండనుంది.

బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. ఇక మిగిలిన75% చలాన్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లను ముమ్మరం చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు .ఫైన్లు తగ్గించారని రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని వాహనదారులను హెచ్చరించారు.

Tags:    

Similar News