Hyderabad Traffic Challan: పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్.. నెలరోజులు మాత్రమే..

Hyderabad Traffic Challan: వాహనాల పెండింగ్ చలాన్‌లను ఆల్ లైన్‌లోనే చెల్లించాలన్నారు సీపీ రంగనాథ్.;

Update: 2022-02-28 12:05 GMT

Hyderabad Traffic Challan: వాహనాల పెండింగ్ చలాన్‌లను ఆల్ లైన్‌లోనే చెల్లించాలన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. ఇందుకోసం పేటిఎం, గూగుల్ పే వంటి సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. రేపటినుంచి మార్చి 30వ తేదీవరకు చలాన్లపై రాయితీ అమలులో ఉంటుందన్నారు. కరోనా కారణంగా అందరు ఆర్దికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తుచేశారు.

ద్విచక్ర వాహనాలకు 75శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. నోపార్కింగ్ చాలన్‌కు వెయ్యి ఉంటే.. వంద రూపాయలు కడితే సరిపోతుందన్నారు. పేద వర్గాలవారికి వెసులుబాటు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో 5వందల కోట్ల వరకు 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నెలరోజుల వెసులు బాటు వినియోగించుకోవాలని.. చలాన్‌లు కట్టకపోతే స్పెషల్ డ్రైవ్‌ చేపట్టి చర్యలు చేపడుతామన్నారు.

Tags:    

Similar News